స్టైలీష్‌గా ఆశిష్‌..ఆకట్టుకుంటున్న ‘సెల్ఫీష్‌’ కొత్త పోస్టర్‌ | Selfish Movie Release Special Poster | Sakshi
Sakshi News home page

Selfish Movie: మాస్‌ లుక్‌లో స్టైలీష్‌గా ఆశిష్‌..ఆకట్టుకుంటున్న ‘సెల్ఫీష్‌’ కొత్త పోస్టర్‌

May 14 2023 10:52 AM | Updated on May 14 2023 10:52 AM

Selfish Movie Release Special Poster - Sakshi

‘రౌడీబాయ్స్’ తోనే నటుడిగా సత్తా చాటిన యంగ్‌ హీరో ఆశిష్‌ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్‌.   విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా నేడు(మే 14) ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

(చదవండి: భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం )

ఈ పోస్టర్‌లో ఆశిష్‌ మాస్‌ లుక్‌లో స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆశిష్‌కు జోడిగా ఇవానా నటిస్తోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, చంద్రబోస్ లిరిక్ రైటర్‌గా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీగా పని చెస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement