'పిల్లలను కనాలని లేదు.. ఎందుకంటే?'.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్! | Sandalwood Actress Hitha Chandrashekar Comments On Childrens | Sakshi
Sakshi News home page

Hitha: 'పిల్లల కంటే కుక్కలే నయం': హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్!

Apr 7 2024 6:49 PM | Updated on Apr 7 2024 7:15 PM

Sandalwood Actress Hitha Chandrashekar Comments On Childrens - Sakshi

ప్రముఖ కన్నడ నటి, హీరోయిన్ హితా చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటుడు సిహి కహీ చంద్రు కుమార్తె అయిన ముద్దుగుమ్మ 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ శ్రీనివాస్‌ను పెళ్లాడింది. పెళ్లయి ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావొస్తున్నప్పటికీ పిల్లలు లేరు. అయితే బంధుమిత్రుల నుంచి మనవడిని ఎప్పుడు ఇస్తావ్? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షోలో పాల్గొన్న హిత చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

హితా మాట్లాడుతూ.. "ఫస్ట్ నాకు పిల్లలను కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించారు. మాకు పిల్లలు ఎందుకు కావాలి? నాకు అందరిలా పిల్లలు కనాలని ఏం అనిపించడం లేదు. ప్రస్తుతం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూస్తున్నాయో నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఇంకో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అన్నది నా ఆలోచన. కిరణ్‌కి కూడా అలాగే అనిపించింది" అని చెప్పుకొచ్చింది.

అనంతరం మాట్లాడుతూ..'మాతృత్వాన్ని ఆస్వాదించాలంచే మనమే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్కపిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు.  మనకు వృద్ధాపం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో ఎవరు చూసుకుంటారని చాలా మంది అంటుంటారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధ లేదు" అని తెలిపింది. 

అంతే కాకుండా ఈరోజు ఎంత మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు? అని హితా ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో కొడుకు, కూతుళ్లు అమెరికాలో ఉంచే వారి తల్లితండ్రులు ఎక్కడో ఒకచోట ఉంటున్నారు. కేవలం ఆ ఇద్దరు దంపతులు మాత్రమే కలిసి ఉంటున్నారు.. అలాంటప్పుడు పిల్లలు ఉన్నా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతుందని హిత అన్నారు. ఇక్కడ పిల్లలను కనొద్దని నేను చెప్పట్లేదు.. కానీ ఇది నా నిర్ణయం అని మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. హితా చంద్రశేఖర్‌ శాండల్‌వుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement