యంగ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్‌ వైరల్! | Sandalwood Actress Adithi Prabhudeva Maternity Photoshoot Viral | Sakshi
Sakshi News home page

నిండు గర్భంతో యంగ్ హీరోయిన్‌.. వైరలవుతోన్న ఫోటోషూట్!

Mar 26 2024 6:21 PM | Updated on Mar 26 2024 6:32 PM

Sandalwood Actress Adithi Prabhudeva Maternity Photoshoot Viral - Sakshi

కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది.  బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్‌ను వివాహం చేసుకుంది.

అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్‌ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి  సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్‌ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.  ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement