నెలకు రూ.10వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్‌ | Renukaswamy Messages To Actress Pavithra Gowda | Sakshi
Sakshi News home page

నెలకు రూ.10వేలు ఇస్తానంటూ నటి పవిత్రగౌడకు మెసేజ్‌

Sep 7 2024 7:32 AM | Updated on Sep 7 2024 11:37 AM

Renukaswamy Messages To Actress Pavithra Gowda

కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్‌, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో   చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దర్శన్‌ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.

కన్నీరుపెట్టిన పవిత్రాగౌడ 
రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్‌ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్‌ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్‌లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

గౌతమ్‌ పేరుతో రేణుకాస్వామి సందేశాలు 
రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేణుకాస్వామి గౌతమ్‌ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టించి పవిత్రాగౌడకు అశ్లీల మెసేజ్‌ పంపించేవాడని  పోలీసులు కోర్టుకు సమరి్పంచిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. నెలకు రూ.10వేలు ఇస్తా, తనతో లివింగ్‌ రిలేషన్‌షిప్‌ కొనసాగించాలని  మెసేజ్‌ పెట్టడంతో  నటి పవిత్రాగౌడ కోపోద్రిక్తురాలైంది. తన స్నేహితుడు పవన్‌ పేరుతో  రేణుకాస్వామితో చాటింగ్‌ చేసి అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడనే విషయాలను ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement