క్రాక్‌ ఆరంభం | Ravi Teja resumes shooting for Krack | Sakshi
Sakshi News home page

క్రాక్‌ ఆరంభం

Oct 8 2020 12:21 AM | Updated on Oct 8 2020 12:21 AM

Ravi Teja resumes shooting for Krack - Sakshi

రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్‌’. గతంలో రవితేజతో  ‘డాన్‌ శీను’, ‘బలుపు’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మలినేని గోపీచంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఉద్వేగభరితమైన కథా కథనాలతో ‘క్రాక్‌’ సినిమా రూపొందుతోందని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్‌ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: జి.కె. విష్ణు

Advertisement
 
Advertisement
Advertisement