Ravi Teja Khiladi Movie: ఖిలాడీ ఆటా పాటా.. | Ravi Teja Khiladi Movie Updates | Sakshi
Sakshi News home page

Ravi Teja Khiladi Movie: ఖిలాడీ ఆటా పాటా..

Sep 25 2021 5:19 AM | Updated on Sep 25 2021 2:28 PM

Ravi Teja Khiladi Movie Updates - Sakshi

రవితేజ, డింపుల్‌ హయతి

ఖిలాడీ యాక్షన్‌ పూర్తయింది.. ఇక పాటలే పాడుకోవాలి. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. ‘ప్లే స్మార్ట్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాక్టర్‌ జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌తో కలసి హవీష్‌ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తయింది.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. థియేటర్లో ప్రేక్షకులకు థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్‌ వర్మ సిద్ధమవుతున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌కి, తొలి పాటకి చాలా మంచి స్పందన వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ కొడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement