బాక్సాఫీస్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. సరికొత్త అధ్యాయానికి పుష్ప నాంది | Pushpa 2 The Rule Countdown Start To Hit Screens In 50 Days, Allu Arjun New Poster Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun Pushpa 2 Poster: బాక్సాఫీస్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. సరికొత్త అధ్యాయానికి పుష్ప నాంది

Oct 17 2024 12:05 PM | Updated on Oct 17 2024 1:11 PM

Pushpa 2 The Rule Countdown Start

ఐకాన్‌స్టార్‌  అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప2 కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈమేరకు చిత్ర యూనిట్‌తో పాటు బన్నీ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు.  ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి రానున్న ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, హీరోయిన్‌ శ్రీ వల్లీ పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

వాస్తవంగా పుష్ప2 సినిమా ఆగష్టు 15న విడుదల కావాల్సింది. అయితే, నిర్మాణ విలువలు మరింత బలంగా ఉండాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకోవడంతో సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో  ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుందని గతంలోనే ప్రకటించారు. కానీ, ఒకరోజు ముందే పుష్పగాడి రూల్‌ ప్రారంభం అవుతుందని కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఒక పోస్టర్‌ను అల్లు అర్జున్‌ పంచుకున్నారు. డిసెంబర్‌ 6న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు. 50 రోజుల  కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని తెలిపింది.

పుష్ప2 ఫస్టాప్‌ ఇప్పటికే లాక్‌ చేయబడిందని మైత్రి మూవీ మేకర్స్‌ పేర్కొంది. అది ఫుల్‌ ఫైర్‌తో ఉంటుందని టీమ్‌ తెలిపింది. పుష్ప2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తుపాన్‌ క్రియేట్‌ చేస్తుంది.. దానిని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్‌ చెప్పారు. భారతీయ చలనచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్‌  లిఖిస్తాడని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement