ప్రభాస్‌ బర్త్‌డే నాడు ఏమైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారా..? | Prabhas Birthday: Any Update On Salaar Movie? | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ బర్త్‌డే నాడు ఏమైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారా..?

Oct 22 2023 10:19 AM | Updated on Oct 22 2023 10:41 AM

Prabhas Birthday Salaar Update - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23.  కొన్ని గంటల్లో ఆయన ఫ్యాన్స్‌ భారీగా సెలబ్రేట్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో వేల కోట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులున్నాయి.  తనతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్, నాగ్ అశ్విన్ కల్కి, మారుతి డైరెక్షన్‌లో రాజా డీలక్స్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో మరోక సినిమా ఉంది. అన్నీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లే కానీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోసం ఆయన పుట్టినరోజు కానుకగా ఎవరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

(ఇదీ చదవండి: బూతులు బిగ్‌ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్‌ చేస్తారంటూ )

ఇప్పటికైతే సలార్‌ నుంచి మరోక టీజర్‌ లేదా ట్రైలర్‌ వస్తుందని ఫ్యాన్స్‌ అంచనా వేశారు. కానీ సలార్‌ మేకర్స్‌ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కనీసం  బర్త్ డే రోజున ఏదైనా ఇస్తున్నాం అనే అనౌన్స్మెంట్ కూడా ఎవరి నుంచి బయటకి రాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ చాలా నిరుత్సాహంగా ఉన్నారు.

ప్రభాస్‌ చేతిలో పేరుకు మాత్రం అన్ని భారీ సినిమాలే ఉన్నాయి. కానీ ఒక్క సినిమా నుంచి కూడా అప్డేట్ లేదు. కనీసం అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే అనే విషయం అయినా వారికి గుర్తుందా అంటూ షోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  #Prabhas, #Salaar, #SalaarCeaseFire, #SalaarComingBloodySoon, #SalaarCeaseFireOnDec22 హ్యాష్‌ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ బర్త్‌ డే నేపథ్యంలో సలార్ టీం ఫ్యాన్స్‌ కోసం బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తారేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement