కుర్రకారును కట్టి పడేసే అంశాలతో 'బ్యాక్ డోర్' | Poorna Back Door Movie To Release Coming Soon | Sakshi
Sakshi News home page

Back Door Movie: విడుదల సన్నాహాల్లో 'బ్యాక్ డోర్'

Oct 13 2021 4:33 PM | Updated on Oct 13 2021 4:33 PM

Poorna Back Door Movie To Release Coming Soon - Sakshi

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత 

నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్యాక్ డోర్‌’లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు... అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు... హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. తను నటించిన "బ్యాక్ డోర్" క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.  ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ,  సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement