ఒక టికెట్‌ కొంటే ఇంకో టికెట్‌ ఫ్రీ | One Plus One Ticket Offered For Naari Movie | Sakshi
Sakshi News home page

‘నారి’ సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Mar 5 2025 10:33 AM | Updated on Mar 5 2025 10:33 AM

One Plus One Ticket Offered For Naari Movie

ఆమని(Aamani) లీడ్‌ రోల్‌లో వికాస్‌ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనికా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి’(Naari Movie). సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.

 ‘‘మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించడం, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13–20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే అంశాలతో ‘నారి’ని రూపొందించాం. విలువైన అంశాలతో తీసిన ఈ సినిమా అందరికీ చేరువ కావాలని 7, 8 తేదీల్లో ‘నారి’ని చూసే కపుల్స్‌ కోసం టికెట్స్‌పై వన్‌ ఫ్లస్‌ వన్‌ ఆఫర్‌ ఇస్తున్నాం. ఆ రెండు రోజుల్లో అన్ని షోస్‌కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement