OLD: ఆసక్తిని పెంచుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓఎల్‌డీ’ కాన్సెప్ట్ గ్లింప్స్ | OLD Concept Glimpse Out | Sakshi
Sakshi News home page

OLD: ఆసక్తిని పెంచుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓఎల్‌డీ’ కాన్సెప్ట్ గ్లింప్స్

Apr 10 2024 3:54 PM | Updated on Apr 10 2024 4:08 PM

OLD Concept Glimpse Out - Sakshi

మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓఎల్‌డీ’(OLD). రాకేశ్‌ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్టిమేట్ సినీ ప్లానెట్ పతాకంపై జి రాణి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తారు.

ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్‌ మాట్లాడుతూ.. ‘ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ. మా చిత్రానికి "ఓ ఎల్ డి" టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement