అట్టహాసంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Ntr Prashanth Neel Movie Launch News And Release Date | Sakshi
Sakshi News home page

NTR Neel: సైలెంట్‍‌గా కొత్త సినిమా మొదలుపెట్టిన తారక్ - ప్రశాంత్ నీల్

Aug 9 2024 12:54 PM | Updated on Aug 9 2024 2:50 PM

Ntr Prashanth Neel Movie Launch News And Release Date

అనుకున్నదే జరిగింది. మూడు రోజుల క్రితం రూమర్ ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడే అదే నిజమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‍‌లో శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్‌ షురూ అయింది. ఈ వేడుకలో తారక్, ప్రశాంత్ నీల్ కుటుంబాలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: థియేటర్‌లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!)

చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర'తో బిజీ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ 'సలార్' చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో మూవీ పట్టాలెక్కించారు. ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

వీళ్ల చెప్పిన దాని బట్టి చూస్తే దాదాపు 16 నెలల సమయముంది. ఇదే టైంలో ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కూడా చేస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు తారక్ సినిమా మొదలైంది. కాబట్టి ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయడమంటే అదీ 2026లో అవుతుంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: సినిమా హీరోలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు)

 

Advertisement
 
Advertisement
Advertisement