స్వామినాథన్‌ డైరెక్షన్‌లో నయనతార? | Nithilan Swaminathan Teams Up with Lady Superstar Nayanthara? | Sakshi
Sakshi News home page

స్వామినాథన్‌ డైరెక్షన్‌లో నయనతార?

Aug 14 2024 12:50 PM | Updated on Aug 14 2024 1:32 PM

Nithilan Swaminathan Teams Up with Lady Superstar Nayanthara?

ఏ రంగంలోనైనా విజయం అనేది అవకాశాలను పెంచుతుంది. నటి నయనతార అలాంటి విజయాలతోనే లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. దీంతో నాలుగు పదుల వయసులోనూ కథానాయకిగా అవకాశాలు వరుస కడుతున్నాయి.  రూ. 10 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్‌ చేస్తున్నా నో పోబ్లమ్‌ అంటున్నారు నిర్మాతలు. అలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. నయనతార నటించిన టెస్ట్, మన్నాంగట్టి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. తాజాగా మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నారు. 

తమిళంలో కవిన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా మూక్కుత్తి అమ్మన్‌ –2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఒప్పందం దశలో ఉన్నాయి. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మహారాజా చిత్రం ఫేమ్‌ నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో నయనతార నటించనున్నట్లు సమాచారం. కురంగు బొమ్మై చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టిన నితిలన్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తగిన సమయం తీసుకుని విజయ్‌సేతుపతి హీరోగా తెరకెక్కించిన చిత్రం మహారాజా. ఇది విజయ్‌సేతుపతి 50వ చిత్రం కావడం విశేషం. 

చాలా కాలంగా మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ బహుభాషా నటుడికి మహారాజా చిత్రం సంచలన విజయాన్ని అందించి నూతనోత్సాహాన్ని కలిగించింది. ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. కాగా దర్శకుడు నితిలన్‌ తన తదుపరి చిత్రానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నయనతార కథానాయకిగా ఈయన తెరకెక్కించనున్న చిత్రానికి మహారాణి అనే టైటిల్‌ను కూడా నిర్ణయించినట్లు సమాచారం. దీని మహారాజా చిత్ర నిర్మాణ సంస్థ ఫాషన్‌ స్టూడియోస్‌ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో ఈ చిత్రం అధికారిక ప్రకటన కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement