Mayurakshi Movie To Release On 3rd June Deets Inside | Hero Mukundan | Miya George - Sakshi
Sakshi News home page

Mayurakshi Movie: విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌  `మ‌యూరాక్షి `

May 21 2022 4:22 PM | Updated on May 21 2022 4:44 PM

Mayurakshi Movie To Release On 3rd June - Sakshi

`భాగ‌మ‌తి` ఫేం ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం `మ‌యూరాక్షి`. శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న  ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా  తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్  సెక్ర‌ట‌రి ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ.. ‘ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్న జ‌యంత్ సినిమాల మీద ఆస‌క్తితో నిర్మాత‌గా మారి ఇప్ప‌టికి రెండు చిత్రాలు రిలీజ్ చేశారు. ఇది త‌న మూడో చిత్రం. ప్యాష‌న్ తో వ‌చ్చే కొత్త నిర్మాత‌ల‌ను ఆద‌రిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వ‌స్తాయి. ఎంతో మందికి ప‌ని దొరుకుతుంది. ఈ సినిమా స‌క్సెస్ సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.

నిర్మాత వరం జయంత్‌ కుమార్‌ మాట్లాడూతూ..‘స‌స్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్  గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ న‌ట‌న‌, గోపీసుంద‌ర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్.   జూన్ 3న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement