చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్‌ స్పందన | Lawrence Response On Chandramukhi Sequel | Sakshi
Sakshi News home page

చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్‌ స్పందన

Aug 2 2020 9:59 PM | Updated on Aug 2 2020 10:20 PM

Lawrence Response On Chandramukhi Sequel - Sakshi

చైన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ బంపర్‌ హిట్‌ మూవీ ‘చంద్రముఖికి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమా అన్ని భాషలలో విజయవంతం సాధించింది. కాగా చంద్రముఖి సీక్వెల్‌ సినిమా వార్తను నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గతంలోనే చెప్పారు. అంతేకాదు, ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఇటీవలే ప్రకటించారు. గతంలో చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ నిర్మిస్తోందని తెలిపారు.

లారెన్స్ ఈ సినిమా గురించి ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల రూమర్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో ప్రధాన కథానాయిక గురించి రూమర్లు వచ్చాయి. హీరోయిన్‌గా జ్యోతిక అని ఒకసారి, సిమ్రన్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్లపై తాజాగా రాఘవ లారెన్స్ స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు.  ‘చంద్రముఖి 2’ కథానాయిక గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్, సిమ్రన్ మేడమ్ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. కానీ, ఈ వార్తలన్నీ అసత్యాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తామని లారెన్స్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement