Lal Singh Chaddha Release Date: Lal Singh Chaddha Not Postponed For Release - Sakshi
Sakshi News home page

ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న ఆమిర్‌ ఖాన్‌!

Jan 22 2022 10:46 AM | Updated on Jan 22 2022 11:20 AM

Lal Singh Chaddha Not Postponed For Release - Sakshi

‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటున్నారు ఆమిర్‌ ఖాన్‌. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. వయాకామ్‌ స్టూడియోస్, ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు గత ఏడాది నవంబరులో చిత్రబృందం ప్రకటించింది.

అయితే ఇదే తేదీన యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ సినిమా విడుదలకు షెడ్యూలైంది. ఈ నేపథ్యంలో ‘లాల్‌సింగ్‌ చద్దా’ విడుదల వాయిదా పడొచ్చనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో ‘లాల్‌సింగ్‌ చద్దా’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ఏప్రిల్‌ 14నే విడుదల చేస్తామని చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. ఇక 1994లో వచ్చిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement