మనోరంజన్‌ కాదు.. పబ్‌ రంజన్‌..ట్రైలర్‌ చూస్తే నవ్వులే నవ్వులు | Kiran Abbavaram: Rules Ranjann trailer out | Sakshi
Sakshi News home page

Rules Ranjann: మనోరంజన్‌ కాదు.. పబ్‌ రంజన్‌..ట్రైలర్‌ చూస్తే నవ్వులే నవ్వులు

Sep 9 2023 12:09 AM | Updated on Sep 9 2023 8:47 AM

Kiran Abbavaram: Rules Ranjann trailer out - Sakshi

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి

‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ (గోపరాజు రమణ). ‘బీర్‌ ఓకే’ (కిరణ్‌ అబ్బవరం) అనే సంభాషణలతో మొదలవుతుంది ‘రూల్స్‌ రంజన్‌’ ట్రైలర్‌. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా ఆఫీస్‌లో వీకెండ్స్‌ వస్తే నన్ను ఏమంటారో తెలుసా.. మనోరంజన్‌ కాదు.. పబ్‌ రంజన్‌ అంటారు (కిరణ్‌ అబ్బవరం), ‘ఈ రూల్స్‌ రంజన్‌ పంబ్‌ రంజన్‌గా ఎందుకు మారాడు? (మరో పాత్రధారి) అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. మెహర్‌ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్‌ గణేష్, సహనిర్మాత: రింకు కుక్రెజ.

Advertisement
 
Advertisement
Advertisement