Karthikeya 2 Motion Poster: Hero Nikhil, Anupama Parameswaran New Movie 'Karthikeya 2 Motion Poster' Released - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Motion Poster: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం..

Published Wed, Jun 1 2022 12:12 PM | Last Updated on Wed, Jun 1 2022 12:28 PM

Karthikeya 2 Motion Poster Out - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌ తెరకెక్కుతున్న తాజా చిత్రం కార్తికేయ2. 2014లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘కార్తికేయ’కు సీక్వెల్‌ ఇది. చాలాకాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకే రిలీజ్‌కు సిద్దమైంది. జులై 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కార్తికేయ2’ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

(చదవండి: సింగర్‌ కేకే మరణంపై అనుమానాలు!)

ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తున్న నిఖిల్‌, అనుపమ, శ్రీనివాసరెడ్డిలను ఈ పోస్టర్‌లో గమనించవచ్చు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ మోషన్‌ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నిఖిల్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్‌ నటించగా.. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement