మిషన్‌ మేకోవర్‌ | kamal haasan upcoming movies updates | Sakshi
Sakshi News home page

మిషన్‌ మేకోవర్‌

Oct 16 2024 12:09 AM | Updated on Oct 16 2024 12:09 AM

kamal haasan upcoming movies updates

ఇప్పుడు కమల్‌హాసన్‌ మిషన్‌ ఏంటంటే... ‘మేకోవర్‌’ అన్నమాట. కొత్త సినిమా కోసం సరికొత్తగా మేకోవర్‌ అవుతున్నారు కమల్‌హాసన్‌. ఆయన హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫైట్‌ మాస్టర్స్‌ అన్బు–అరివుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ‘ఇండియన్‌’ సీక్వెల్స్‌ ‘ఇండియన్‌ 2, ఇండియన్‌ 3’ సినిమాలతో పాటు ‘థగ్‌ లైఫ్‌’ చిత్రంతో కమల్‌హాసన్‌ బిజీగా ఉన్నారు.

ఈ కారణంగా అన్బు–అరివులతో కమల్‌హాసన్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘ఇండియన్‌ 2’ విడుదల కాగా, ‘ఇండియన్‌ 3, థగ్‌ లైఫ్‌’ చిత్రాలను కమల్‌ పూర్తి చేశారు. దీంతో అన్బు–అరివులతో చేయాల్సిన సినిమాను వచ్చే జనవరి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం కమల్‌హాసన్‌ స్పెషల్‌ మేకోవర్‌ అవుతున్నారు. ఆయన తాజా లుక్‌ సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు ‘ఇండియన్‌ 3, థగ్‌ లైఫ్‌’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement