Kaalamega Karigindhi Trailer : స్కూల్‌ లవ్‌స్టోరీ .. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ | Kaalamega Karigindhi Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Kaalamega Karigindhi Trailer : స్కూల్‌ లవ్‌స్టోరీ .. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

Mar 15 2025 5:24 PM | Updated on Mar 15 2025 5:35 PM

Kaalamega Karigindhi Movie Trailer Out

ప్రేమ కథలకు టాలీవుడ్‌లో ఎప్పుడు మంచి ఆదరణనే ఉంటుంది. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలను ఆడియన్స్‌ హిట్‌ చేస్తుంటారు. అందుకే తెలుగు తెరపై ప్రేమ కథలు వస్తూనే ఉంటాయి. త్వరలోనే మరో స్వచ్ఛమైన ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందకు రానుంది. వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది"(Kaalamega Karigindhi). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"కాలమేగా కరిగింది" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్ లు...అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్ గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్ లో ఆకట్టుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement