జాన్‌ అబ్రహాం, అభిషేక్‌ల మూవీకి డైరెక్టర్‌ ఫిక్స్‌ | Jagan Shakti To Direct John And Abhishek In Ayyappanum Koshiyum Hindi Remake | Sakshi
Sakshi News home page

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్’ రీమేక్‌ డైరెక్టర్‌ ఫిక్స్‌!

Mar 20 2021 10:42 AM | Updated on Mar 20 2021 10:42 AM

Jagan Shakti To Direct John And Abhishek In Ayyappanum Koshiyum Hindi Remake - Sakshi

మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా హిందీలో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే. జాన్‌ అబ్రహాం, అభిషేక్‌  బచ్చన్‌ హీరోలుగా నటించనున్నారు. మలయాళ వెర్షన్‌లో బిజూ మీనన్‌ చేసిన క్యారెక్టర్‌ను జాన్‌ అబ్రహాం, పృథ్వీరాజ్‌ చేసిన పాత్రను అభిషేక్‌ బచ్చన్‌ చేయనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన జగన్‌ శక్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ ‘దస్వీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటు జాన్‌ అబ్రహాం కూడా ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’, షారుక్‌ఖాన్‌ ‘పటాన్‌’ సినిమాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement