డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్‌ | Jabardasth Varsha Gets Emotional Over Bad Comments | Sakshi
Sakshi News home page

అడుక్కునేవాళ్లకు పుట్టినా బాగుండు.. ఓ ఈవెంట్‌లో గుడిసెలో..: ఏడ్చేసిన వర్ష

Apr 5 2025 7:40 PM | Updated on Apr 5 2025 7:59 PM

Jabardasth Varsha Gets Emotional Over Bad Comments

కామెడీ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్‌, వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలివారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తనను నిజంగానే తిట్టారంటోంది నటి, కమెడియన్‌ వర్ష (Varsha). ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వర్ష మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించాను. కానీ ఒకానొక సమయంలో కొందరివి రెండు ముఖాలు చూశాను. సీరియల్‌ నుంచి షోకు వచ్చి హైలైట్‌ అయినప్పుడు వారు చూపించిన ప్రేమ సడన్‌గా మాయమవడంతో తట్టుకోలేకపోయాను.

నిజంగానే తిట్టారు
నా మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు నేను సరదాగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్లు నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయాను. ఛీ, దేవుడా ఎందుకీ బతుకు ప్రసాదించావు.. అడుక్కునేవారి ఇంట్లో పుట్టినా బాగుండు కదా! డబ్బు, పేరు, అందరూ ఉన్నా సుఖం లేదు. ఇలాంటి జీవితం నాకు మళ్లీ రావొద్దని దేవుడిని కోరుకుంటాను. అసలు ఈ ఫీల్డ్‌కే రావొద్దు.

కావాలనే పిలిచి
ఏడేళ్ల క్రితం నన్ను ఓ ఈవెంట్‌కు పిలిస్తే వెళ్లాను. నేనే ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని మరీ వెళ్లాను. అందరూ డ్యాన్స్‌ చేస్తున్నారు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు. నన్నెప్పుడు పిలుస్తారా? అని స్టేజీ వెనకాల ఓ గుడిసెలో కూర్చున్నాను. ఓ అమ్మాయి తను రెడీ అవడానికి అద్దం పట్టుకోమని అడిగింది. గంటసేపు తనకు అద్దం పట్టుకుని కూర్చున్నాను. ఆలస్యంగా అర్థమైందేంటంటే నన్ను కావాలనే పిలిచి అలా ఖాళీగా వెనక కూర్చోబెట్టారు. అప్పుడెంతో బాధపడ్డాను అని వర్ష కంటతడి పెట్టుకుంది.

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement