I20 Movie: స్త్రీల గౌరవం పెంచేలా ‘ఐ 20’ | I20 Movie Release Date Out | Sakshi
Sakshi News home page

I20 Movie: స్త్రీల గౌరవం పెంచేలా ‘ఐ 20’

Jun 6 2024 5:36 PM | Updated on Jun 6 2024 5:36 PM

I20 Movie Release Date Out

సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20",  బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు.  ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మంచి సందేశం ఉన్న చిత్రం. ఈ చిత్రం జూన్ 14న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మన దేశం లో స్త్రీ లను ప్రత్యేకంగా గౌరవీస్తాం. వాళ్ళ గౌరవం గురించే ఈ చిత్రాని నిర్మించాం. కథ చాలా బాగా వచ్చింది. మంచి రొమాన్స్ ఉంది, కామెడీ అయితే అద్భుతంగా వచ్చింది.

ఇప్పటికి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది, మొదటగా జూన్ 7 న విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు నా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి అని జూన్ 14 విడుదల చేస్తున్నం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో ఉంది కావున మా సినిమా పక్కాగా విజయం సాధిస్తుంది" అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement