Bigg Boss Fame Divi Vadthya Inaugurates Barkaas Indo Arabic Restaurant - Sakshi
Sakshi News home page

మండీ బిర్యానీ..కెబాబ్స్ అంటే ఇష్టం : దివి

Apr 6 2023 1:51 PM | Updated on Apr 6 2023 3:02 PM

I Like Mandi Biryani Bigg Boss Fame Divi Says - Sakshi

బిగ్‌బాస్‌ షోతో బాగా పాపులర్‌ అయింది దివి. అంతకు ముందు మహేశ్‌ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షో తర్వాత దివి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. గ్రాండ్‌ ఫినాలేలో మెగాస్టార్‌ చిరంజీవి ఆమె అందం గురించి పొగడడంతో పాటు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో దివి పేరు తెలుగు ప్రేక్షకులకు నోటెడ్‌ అయింది. ఇక బిగ్‌బాస్‌ తర్వాత కరీర్‌ పరంగా దివి ఫుల్‌ బిజీ అయింది. ఒకవైపు వరుస సినిమాలు..మరోవైపు షాపు ఓపెనింగ్స్‌, యాడ్స్‌ అంటూ బిజీ బిజీగా గడుపుతుంది.

తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్‌లోని కోంపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన  బార్కాస్ ఇండో అరబిక్  రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చికెన్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.

ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండా ఉండలేనన్నారమే. ‘హైదరాబాద్ అంటేనే  మనకు గుర్తొచ్చేది  నోరూరించే  రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్  రెస్టారెంట్ మన హైదరాబాద్ కు   తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement