Hrithik Roshan Ex Wife Sussanne Khan: Wishes Rumoured Boyfriend Arslan Goni On Birthday - Sakshi
Sakshi News home page

Hrithik Roshan Ex Wife: ఆ నటుడితో హృతిక్‌ మాజీ భార్య సూసానే ఖాన్‌ లవ్‌ ఎఫైర్‌!, ఇదిగో ఫ్రూఫ్‌

Dec 21 2021 1:53 PM | Updated on Dec 21 2021 4:39 PM

Hrithik Roshan Ex Wife Sussanne Khan Wishes Rumoured Boyfriend Arslan Goni On Birthday - Sakshi

కొంతకాలంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో మునిగితేలుతొందంటూ బీ-టౌన్‌లో గుసగులు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌తో విడాకుల అనంతరం అర్స్లాన్ గోనితో ఆమె సన్నిహితంగా ఉండటంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే దీనిపై ఇంతవరకు సుసానే ఖాన్‌ కానీ అర్స్లాన్ గోని కానీ స్పందించలేదు. ఈ రూమర్లను కూడా వారెప్పుడు ఖండించలేదు. ఈ క్రమంలో అర్స్లాన్ గోని, సుసానే రూమార్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌గా మీడియాలో పేర్కొంటున్నారు.

చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్‌ తారలు వీరే..

ఇదిలా ఉంటే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనడానికి సుసానే తాజా పోస్ట్‌ మరోసారి ఉదాహరణగా నిలిచింది. డిసెంబర్‌ 20న అర్స్లాన్ గోని బర్త్‌డే. ఈ సదర్భంగా సుసానే అతడితో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే. నీ జీవితంలో నీవు కోరుకునేవన్నీ ఉండాలని, స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూసిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ రాసుకొచ్చింది. దీనికి గోనీ స్పందిస్తూ.. ‘లవ్ యూ’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు కొందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతుగా కామెంట్‌ చేస్తుండగా..

చదవండి: పుష్ప స్పెషల్‌ సాంగ్‌పై సమంత హాట్‌ కామెంట్స్‌, సెక్సీగా కనిపించాలంటే..

మరికొందరూ విమర్శిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్టోబర్‌లో సుసానే పుట్టినరోజు సందర్భంగా గోనీ కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘హ్యాపీ బర్త్ డే డాలింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో నేను చూసిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తివి నీవు. నీవు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు. కాగా హృతిక్‌ రోషన్‌ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేను 2000 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే విభేదాల వల్ల 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement