HEAT Movie Trailer: మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్.. | HEAT Movie Trailer Out | Sakshi
Sakshi News home page

HEAT Movie Trailer: మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్..

May 1 2023 4:39 PM | Updated on May 1 2023 4:39 PM

HEAT Movie Trailer Out - Sakshi

వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హీట్‌’.  ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను ఇటీవలె విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మే 5న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది.

'ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్' అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. చేజింగ్ సీన్లు, మర్డర్ సీన్లతో ట్రైలర్‌ ఉరుకులు పరుగులు పెట్టినట్టు అనిపిస్తోంది.

(చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్‌ తల్లి)

ట్రైలర్ మధ్యలో వచ్చిన.. 'మనకి అర్హత లేని వాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి'.. 'ఆటలో ఆడాలంటే..ఆడటం మాత్రమే తెలిస్తే చాలదు.. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేయగలిగిన వాడు.. ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు'.. 'మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్'.. 'ఎమోషన్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్ వెపన్'.. అంటూ వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement