పక్కా కమర్షియల్‌

Gopichand New Movie Pakka Commercial Title Fix - Sakshi

పక్కా కమర్షియల్‌ అనే మాటను సినిమాల్లో తరచూ వింటూనే ఉంటాం. అంటే.. సినిమా పక్కా కమర్షియల్‌ అని అర్థం. తాజాగా ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేసుకున్నారట మారుతి. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారట. గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్‌ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. మారుతి సినిమాల్లో హీరోలకు ఓ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. ఆ విధంగా తాజా సినిమాలో హీరో పక్కా కమర్షియల్‌ మైండ్‌ సెట్‌ ఉన్నవాడని కూడా ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top