‘వ‌ల్లంకి పిట్టా’ బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?

Gangotri Movie Child Artist Kavya Kalyanram Recent Life Story In Telugu - Sakshi

కావ్య కల్యాణ్‌రామ్ తెలుసా మీకు?  ఆమె ఎవరు అంటారా? సరే, అల్లు అర్జున్‌ ఫస్ట్‌ మూవీ గంగోత్రిలోని ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’వీడియో సాంగ్‌ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఓ బుడ్డి పాప క్యూట్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ బుడ్డి పాప పేరే  కావ్య కల్యాణ్‌రామ్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ‘గంగోత్రి బేబీ’ ప్రస్తుతం ఎలా ఉంది?  ఏం చేస్తుందో తెలుసా? 

హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్‌ రామ్‌ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్‌’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్‌ కల్యాణ్‌ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్‌గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం కావ్య లుక్స్‌.. మంచి హీరోయిన్ కి ఎగ్జాక్ట్ గా స్యూట్ అయ్యేలా ఉంది. హాట్ బేబీగా మారిన క్యూట్ బేబీ కావ్య‌కు మంచి ఆఫర్లు వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలని ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top