రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌ నేపథ్యంలో ‘గేమ్‌ ఆన్‌’ | Game On Movie Release Date Out | Sakshi
Sakshi News home page

రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌ నేపథ్యంలో ‘గేమ్‌ ఆన్‌’

Jan 4 2024 2:07 PM | Updated on Jan 4 2024 2:07 PM

Game On Movie Release Date Out - Sakshi

ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో  తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

 ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ...గేమ్ ఆన్ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి  రెస్పాన్స్  వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ర‌థం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవ‌ల్ కు  వెళ్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. అలాగే నేహ సోలంకి త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ప్రస్తుతం విభిన్నమైన క‌థ‌ల‌తో వ‌చ్చే చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో వ‌స్తోన్న మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌న్న న‌మ్మకంతో ఉన్నాం` అన్నారు.

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ  ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్,  ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు న్యూ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌న్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement