Dil Raju Will Release 'Mechanic' Movie Motion Poster - Sakshi
Sakshi News home page

దిల్‌ రాజు చేతుల మీదుగా ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!

Feb 17 2023 4:42 PM | Updated on Feb 17 2023 4:58 PM

Dil Raju Will Release Mechanic Movie Motion Poster - Sakshi

మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్‌ షూటర్‌ అన్నది ట్యాగ్‌లైన్‌. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు.   తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్  దొరబాబు, కిరీటి దామరాజు,  బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement