ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్‌ సిరీస్‌ | Devika And Danny Web Series Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్‌ సిరీస్‌

Jun 8 2025 2:11 PM | Updated on Jun 8 2025 3:00 PM

Devika And Danny Web Series Streaming On This OTT Platform

బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దేవిక అండ్‌ డాని.  ‘శ్రీకారం’ ఫేమ్‌ బి. కిశోర్‌ ఈ సిరీస్‌ కి దర్శకత్వం వహించగా, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా నటించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కామెడీ, హారర్‌ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం జియో హాట్‌ స్టార్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.

రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తే ఎదిరించే అమ్మాయి లాగా  బాగా చేసింది. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement