హైదరాబాద్‪‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే? | Devi Sri Prasad Live Music Show In Hyderabad; Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‪‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే?

Jul 15 2024 12:01 PM | Updated on Jul 15 2024 12:15 PM

Devi Sri Prasad Live Music Show In Hyderabad; Details

సింగర్స్, పాప్ సింగర్స్ చాలామంది దేశంలో వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోలు పెడుతుంటారు. వాటికి జనాల నుంచి ఆదరణ నుంచి కూడా అలానే ఉంటుంది. బయట నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇలాంటి కాస్త తక్కువనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హైదరాబాద్‌లో లైవ్ షోలో ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

దేశవ్యాప్తంగా మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నానని చెప్పిన దేవిశ్రీ.. హైదరాబాద్ నుంచే దీన్ని మొదలుపెడతానని చెప్పాడు. అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)

Advertisement
 
Advertisement
Advertisement