Desiya Thalaivar Movie Release Date - Sakshi
Sakshi News home page

Desiya Thalaivar: 'దేశీయ తలైవర్' రిలీజ్ డేట్ ఫిక్స్

Jul 24 2023 3:29 PM | Updated on Jul 24 2023 3:44 PM

Desiya Thalaivar Movie Release Date Details - Sakshi

తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన నాయకుడు పశుమ్‌‌పొన్‌ ముత్తు రామలింగ దేవర్‌ జీవిత చరిత్ర 'దేశీయ తలైవర్‌' టైటిల్‌తో సినిమాగా తీస్తున్నారు. ఇందులో ముత్తు రామలింగ దేవర్‌ పాత్రలో జేఎం బషీర్‌ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌. అరవింద్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుపుకుంటోంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్)

ఈ సినిమాను అక్టోబర్‌ 30న పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి నిర్మాత ఏఎం.చౌదరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. కాగా ఇటీవలే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌ను 'దేశీయ తలైవర్‌' హీరో, నిర్మాత ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. 

తాము నిర్మిస్తున్న 'దేశీయ తలైవర్‌' గురించి డీకే శివకుమార్‌కు వివరించినట్లు, ఆయన ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించిన జేఎం.బషీర్‌ ముత్తు రామలింగ దేవర్‌ మాదిరిగానే ఉన్నారని ప్రశంసించినట్లు చిత్రవర్గాలు ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కన్నడంలో రాష్ట్రీయ నేత పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

(ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‪‌టైమ్ రికార్డ్!)

Advertisement
 
Advertisement
Advertisement