సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌తో వస్తోన్న కలర్ ఫోటో హీరోయిన్! | Colour photo actress chandini latest Movie Logo Released Today | Sakshi
Sakshi News home page

Chandini Chowdary: సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌తో వస్తోన్న కలర్ ఫోటో హీరోయిన్!

Feb 27 2024 10:06 PM | Updated on Feb 28 2024 1:19 PM

Colour photo actress chandini latest Movie Logo Released Today - Sakshi

కలర్ ఫోటో , గామి చిత్రాల  ఫేమ్ చాందినీ చౌదరి మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో సీ స్పేస్ బ్యానర్‌పై యేవమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై  చేతుల మీదుగా ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోను  ఆవిష్కరించారు. 

ప్రమోషన్లలో ఇది ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా యూజర్స్ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చాందినీ నటన హైలెట్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి నీలేష్ మండాలపు సంగీతం అందించారు. ఈ చిత్రంలో  కేజీఎఫ్  ఫేమ్ వశిష్ట, భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement