Bigg Boss 7: ఎలిమినేట్ అయితేనేం యావర్‌కి జాక్‌పాట్.. టోటల్ రెమ్యునరేషన్ ఎంతంటే? | Bigg Boss 7 Telugu Finale: Prince Yawar Remuneration Details - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Prince Yawar: రెమ్యునరేషన్ ప్లస్ సూట్‌కేస్.. మొత్తం సంపాదన అన్ని లక్షలా?

Dec 17 2023 10:00 PM | Updated on Dec 18 2023 1:58 PM

Bigg Boss 7 Telugu Prince Yawar Remuneration Details - Sakshi

బిగ్‌బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే కప్ కొట్టే విషయంలో ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. చివరికొచ్చేసరికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన మిగతా వాళ్లతో పోలిస్తే జాక్‌పాట్ కొట్టేశాడు. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్ తీసుకుని హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. ఇంతకీ యావర్ ఎలా ఆడాడు? మొత్తం ఎంత సంపాదించాడు?

యావర్ ఇంట్రెస్టింగ్ డెసిషన్
సాధారణంగా తెలుగు షోలో పాల్గొంటున్నారు అంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్‌బాస్ షోలో అయితే ఇది ఇంకా పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనబెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్‌లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్‌లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్‌లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు.

 

రెమ్యునరేషన్ ఎంత?
పేరుకు నటుడు అయినాసరే తన ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని... ఎపిసోడ్స్‌లోని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తనకు డబ్బు చాలా అవసరమని కూడా అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్లే నాగ్.. రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ చేయగా తీసుకుని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్‌కేసు ఆఫర్‌కే ఓటు వేసేసరికి.. ట్రోఫీ రేసు నుంచి తప్పుకొన్నాడు. అలానే వారానికి రూ.లక్షన్నర రెమ్యునరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ. 22.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.37.5 లక్షల వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement