Bholaa Shankar Movie Song Shooting In Hyderabad - Sakshi
Sakshi News home page

మాస్‌ డ్యాన్స్‌ చేసేద్దాం...

Jun 8 2023 2:40 AM | Updated on Jun 8 2023 10:37 AM

Bhola Shankar Movie Song Shooting At Hyderabad - Sakshi

శంకర్‌ మంచి జోష్‌ మీద ఉన్నాడు. అందుకే జోరుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఒక్కడే కాదు.. ప్రేయసితో, చెల్లెలితో, ఇంకా చాలామందితో కలిసి మాస్‌ డ్యాన్స్‌ చేసేద్దాం అంటూ రెచ్చిపోతున్నాడు. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’లోని పాట గురించే చెబుతున్నాం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, చెల్లెలి పాత్రను కీర్తీ సురేశ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట కోసం భారీ సెట్‌ని రూపొందించారు. చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్‌ స్వరపరచిన ఈ మాస్‌ సాంగ్‌కు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement