అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది | Anni Manchi Sakunamule Song Launch by Allu Aravind | Sakshi
Sakshi News home page

అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది

May 9 2023 3:50 AM | Updated on May 9 2023 3:50 AM

Anni Manchi Sakunamule Song Launch by Allu Aravind - Sakshi

అశ్వినీదత్, సంతోష్‌ శోభన్, అల్లు అరవింద్, మాళవికా నాయర్, కె. రాఘవేంద్రరావు, నందినీ రెడ్డి

‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్‌గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్‌ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌. అన్నారు.

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్‌  రిలీజ్‌ చేశారు.

చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు  ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్‌గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్‌) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్‌. 

Advertisement
 
Advertisement
Advertisement