Alia Ranbir Kapoor Marriage: Alia Bhatt Wedding In December, Destination Wedding At Rajasthan - Sakshi
Sakshi News home page

Alia Ranbir Wedding: రాజస్థాన్‌ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌, ఏర్పాట్లు స్టార్ట్‌!

Published Tue, Oct 26 2021 6:12 PM

Alia Bhatt And Ranbir Kapoor Marriage In December Destination Wedding At Rajasthan - Sakshi

Alia Bhatt Ranbir Kapoor Wedding: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ ఏడాదే వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే వారి వివాహం ఎ‍ప్పుడన్నది మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికీ దానిపై అలియా కానీ, రణ్‌బీర్‌ కానీ నోరు మెదపడం లేదు. దీంతో ఈ స్టార్‌ జంట పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలో వీరి పెళ్లి  అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: Govinda Gifts BMW Car To Wife: భార్యకు కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన గోవింద

రాజస్థాన్‌లోని ఐకానిక్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ జంట డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేశారట, ఇందుకు ఇరు కటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు స్టార్ట్‌ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. ఆలోపు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పనులతో పాటు మిగతా ప్రాజెక్ట్స్‌ను కూడా పూర్తి చేసే బిజీగా ఉన్నారట రణ్‌బీర్‌-అలియా. అయితే పెళ్లి తేదీపై మాత్రం క్లారిటీ లేదు. గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

చదవండి: Aryan Khan Drug Case: ‘ఆర్యన్‌ కేసులో బాలీవుడ్‌ నిశ్శబ్ధం అవమానకరం’

Advertisement
Advertisement