మహాసముద్రంలో... | Aditi Rao Hydari Play Role In Maha Samudram | Sakshi
Sakshi News home page

మహాసముద్రంలో...

Oct 13 2020 12:11 AM | Updated on Oct 13 2020 12:11 AM

Aditi Rao Hydari Play Role In Maha Samudram - Sakshi

శర్వానంద్, అదితీ రావ్‌ హైదరి

‘సమ్మోహనం, అంతరిక్షం, వి’ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషించారు అదితీ రావ్‌ హైదరి. చేసే ప్రతి పాత్ర వినూత్నంగా ఉండాలనుకుంటారామె. ‘మహాసముద్రం’లో అలాంటి పాత్రకు అడగడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అదితి. శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితీ రావ్‌ని కథానాయికగా తీసుకున్న విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో నాది మంచి పాత్ర. మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు అదితీ రావ్‌ హైదరి.

Advertisement
 
Advertisement
Advertisement