పూలనే చుట్టేయమంటా... | Adah Sharma Wears Foolwali Dress | Sakshi
Sakshi News home page

పూలనే చుట్టేయమంటా...

Oct 15 2020 12:40 AM | Updated on Oct 15 2020 12:40 AM

Adah Sharma Wears Foolwali Dress - Sakshi

‘పూలనే కునుకేయమంటా... తను వచ్చెనంటా..’ పాట ‘ఐ’ సినిమాలోనిది. విక్రమ్, అమీ జాక్సన్‌లపై పూల మధ్య సాగే ఈ పాట కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు అదా శర్మ ‘పూలనే చుట్టేయమంటా..’ అంటున్నారు. అనడమే కాదు.. చుట్టుకున్నారు కూడా. పూల మొక్కలనే టాప్‌లా చేసుకుని, ధరించారామె. ఆ ఫొటోను షేర్‌ చేశారు అదా శర్మ. ‘ఈ సహజ సిద్ధమైన టాప్‌ చాలా బాగుంది. మీరు చాలా చాలా బాగున్నారు’ అంటూ అదా అభిమానులు ఆమెకు మెసేజ్‌ పెట్టారు. ఇలా ప్రత్యేకంగా తయారవ్వడం అదాకు ఇది మొదటిదేం కాదు. సమయం కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారామె.

Advertisement
 
Advertisement
Advertisement