మీ ప్రేమను తిరిగి ఇస్తా! | Actress Tamanna First Video after Corona Negative | Sakshi
Sakshi News home page

మీ ప్రేమను తిరిగి ఇస్తా!

Oct 16 2020 12:41 AM | Updated on Oct 16 2020 12:41 AM

Actress Tamanna First Video after Corona Negative - Sakshi

కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన హీరోయిన్‌ తమన్నా నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్‌ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్‌ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు (అభిమానులను ఉద్దేశించి) చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాను. ఫుల్‌ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా. వీడియోలో ఈ బ్యూటీ తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement