షాకింగ్‌..  హీరోయిన్ ఇన్‌స్టా పేజీలో న్యూడ్‌ ఫోటోలు! | Actress Sadhika Reaction Over Fake Adult Groups On Her Name | Sakshi
Sakshi News home page

Actress Sadhika Venugopal: హీరోయిన్ ఇన్‌స్టా పేజీలో న్యూడ్‌ ఫోటోలు!

Aug 8 2021 11:56 AM | Updated on Aug 8 2021 3:08 PM

Actress Sadhika Reaction Over Fake Adult Groups On Her Name  - Sakshi

బయటే కాదు స్క్రీన్‌ మీద కూడా సంప్రదాయబద్దకంగా నడుచుకునే నటి సాధికా వేణుగోపాల్‌. అలాంటిది ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌ పేజీలో నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి.  కొంతమంది ఇండస్ట్రీ జనాలు ఆమెకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో సాధిక షాకై.. పోలీసులను సంప్రదించింది. 



వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి సాధికా వేణుగోపాల్‌కు ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘మీరు పద్దతిగా నటిస్తారనుకున్నాం కానీ, సోషల్‌ మీడియాలో ఇలాంటి నగ్న ఫోటోలు పెడతారాని ఊహించలేదండి’అని ఆయన అన్నారు. దీంతో కంగుతిన్న సాధిక.. ‘ఏంటి? నా ఇన్‌స్టాలో బూతు బొమ్మలా? నేను ఎక్స్‌పోజింగే చేయను, అలాంటిది న్యూడ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ఎలా పెడతాను? అని తిరిగి అతన్ని ప్రశ్నించింది.



ఆ అకౌంట్‌ ఆమె పేరు మీదనే ఉందని, ఫోటోలు తనవే అని చెబుతూ.. ఆ లింక్‌ని సాధికాకు షేర్‌ చేశాడు సదరు వ్యక్తి. ఆ లింక్‌ ఓపెన్‌ చేసిన నటికి దిమ్మతిరిగిపోయింది. ఆమె ఫోటోలను మార్పింగ్‌ చేసి నలికీ అకౌంట్‌తో సోషల్‌ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపి ఆధారంగా సదరు ప్రబుద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని కెరీర్ పాడుచేయటం ఇష్టం లేక గట్టి వార్నింగ్‌ ఇచ్చి, కేసు వాపసు తీసుకుంది సాధికా. ఈ విషయాన్ని సాధిక  తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement