లాల్‌సింగ్‌ వాయిదా పడ్డాడు

Aamir Khan Laal Singh Chaddha delayed by an entire year - Sakshi

ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్‌ జంటగా నటిస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’. టామ్‌హ్యాంక్స్‌ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది.

కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్‌ కారణంగా సినిమా షూటింగ్‌ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది. ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం షూటింగ్‌ త్వరలో మళ్లీ ఆరంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్‌ చేశారు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌కి పరిచయం కానున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top