వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి | Sakshi
Sakshi News home page

వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

Published Mon, Nov 20 2023 4:32 AM

చెక్‌పోస్టు వద్ద సిబ్బందికి సూచనలిస్తున్న
సంజయ్‌కుమార్‌ - Sakshi

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా మండల పరిధిలోని కామారెడ్డి– మెదక్‌ జిల్లా సరిహద్దు పోచమ్మరాళ్‌ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని ఔరంగాబాద్‌తండా, కొచ్చెరువుతండా, లింగ్సాప్‌పల్లి, పాటిగడ్డ తండాల్లో పర్యటించారు. ప్రతీ ఒక్కరు తన ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పులను అందజేస్తున్నారన్నారు. ఎవరైనా మద్యం, డబ్బులు పంపిణీచేసి ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే వెంటనే సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా

జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌

Advertisement
Advertisement