వావ్‌.. బసవా | Sakshi
Sakshi News home page

వావ్‌.. బసవా

Published Sun, May 26 2024 6:10 AM

వావ్‌

రూ.15 లక్షలు పలికిన ఎద్దు

గోనెగండ్ల: సాధారణంగా ఒక ఎద్దు విలువ రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతుంది. కాని ఏకంగా గోనెగండ్ల మండలం చిన్న నేలటూరు గ్రామంలో ఓ ఎద్దు ధర రూ.15 లక్షలు పలికింది. ఇది జిల్లాలోనే అత్యధిక ధరగా ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి, గాజుల అమరేశ్వరప్పకు చెందిన వృషభాలు రాష్ట్రంలో ఎక్కడ బండలాగుడు పోటీలు జరిగినా బరిలో నిలుస్తాయి. ఈ ఎద్దులకు ఈ ప్రాంతంలో మంచి క్రేజ్‌ ఉంది. ఇందులో ఒక ఎద్దును శనివారం అనంతపురం జిల్లా ఏ. నారాయణపురం గ్రామానికి చెందిన షేక్‌ నజీర్‌ బాషా రూ.15 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ఎద్దును చూసేందుకు బారులుదీరారు.

వావ్‌.. బసవా
1/1

వావ్‌.. బసవా

Advertisement
 
Advertisement
 
Advertisement