అభివృద్ధికి ఓటు వేయండి | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఓటు వేయండి

Published Sun, May 12 2024 11:05 AM

అభివృద్ధికి ఓటు వేయండి

దేవనకొండ: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా జేసీఎస్‌ కో–ఆర్డినేటర్‌ తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం తెర్నేకల్‌ గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన, జగనన్న చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల దరికి చేర్చారన్నారు. సచివాలయ, వలంటరీ వ్యవస్థల ద్వారా ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారన్నారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా అమలు పరిచిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నాడన్నారు. అబద్ధాల బాబును నమ్మొద్దని, ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి బి.విరూపాక్షిని, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో తెర్నేకల్‌ సర్పంచ్‌ అరుణ్‌కుమార్‌, నాయకులు లుమాంబ, చాప ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే

జగనన్నే సీఎం కావాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా జేసీఎస్‌

కో–ఆర్డినేటర్‌ తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement