‘టీడీపీ దొంగ’ ప్లాన్‌ | Sakshi
Sakshi News home page

‘టీడీపీ దొంగ’ ప్లాన్‌

Published Sun, May 12 2024 11:05 AM

‘టీడీ

సైక్లింగ్‌ పద్ధతిలో దొంగ ఓట్లకు స్కెచ్‌

ఇంకు సిరాను తుడిపేందుకు ‘టిన్నర్‌’

కాంట్రాక్టు వర్క్స్‌ బిల్లుల పేరుతో

వారి ఖాతాలకు నగదు జమ

కాంట్రాక్టర్ల చేతుల మీదుగా దొంగ

ఓటర్లకు డబ్బు పంపిణీ

కర్నూలులో కొనసాగుతున్న ప్రలోభాలు

కర్నూలు: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీటీపీ అడ్డదారులు వెతుకుతోంది. ఓటరు తీర్పుకు కొన్ని గంటలే ఉండడంతో సమయం లేదు మిత్రమా.. పంపకాలను పూర్తి చేయండి.. దొంగ ఓట్లకు ప్లాన్‌ చేయండంటూ కర్నూలు టీడీపీ అభ్యర్థి వారి శ్రేణులను అలెర్ట్‌ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తండ్రీ కొడుకులు బిజీబిజీగా ఉంటున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని గత ఎన్నికల్లో తనకు పోలైన ఓట్లు ఎన్ని? ఏ ప్రాంతంలో తగ్గాయో బేరీజు వేసుకుని అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా డబ్బుల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. ఎలా చేస్తే గెలుస్తాననే అంశాలపై కసరత్తు చేసి చివరి అంకం విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రేణులతో చర్చలు జరిపి ఓటు బ్యాంకును పదిలపరచుకునే విధంగా బీజేపీ నేత తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ప్రచారానికి తెర పడడంతో మిగిలిన ఒక్క రోజును సద్వినియోగం చేసుకునేలా అసలైన మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అనుకూలమైన వార్డుల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేలా చూడడంతో పాటు వీలైనన్ని ఎక్కువ ఓట్లు తనకు పడేలా చూడాలని శ్రేణులకు ఆదేశాలు ఇస్తూ కొత్త ఓటర్లతో పాటు మహిళా ఓటర్లను సంపాదించేలా ఫ్యాక్టరీ ఉద్యోగులను వార్డుల వారీగా తిప్పుతున్నారు.

చక్రం తిప్పుతున్న కాంట్రాక్టు

డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ

అభ్యర్థి ఫ్యాక్టరీలో కాంట్రాక్టు డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఓడీగా వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి దొంగ ఓటర్లకు నగదు పంపిణీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈయన కర్నూలులోనే నివాసముంటున్నాడు. అభ్యర్థికి చెందిన పరిశ్రమల్లో సుమారు 40 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రూమెంట్స్‌, కార్పెంటర్‌ తదితర విభాగాలకు చెందిన పనులను కూలీల ద్వారా ఆయా కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. వారి కింద బిహార్‌, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిశ్రమలకు సమీప గ్రామాలకు చెందిన కూలీలు ఆయా కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారందరినీ కర్నూలులో దొంగ ఓటర్లుగా నమోదు చేయించి కాంట్రాక్టు వర్క్స్‌ బిల్లుల పేరుతో వారి ఖాతాలకు నగదు జమ చేశారు. కాంట్రాక్టర్ల ద్వారా దొంగ ఓటర్లకు డబ్బు పంపిణీ పూర్తి చేశారు. గొందిపర్ల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడుతో పాటు కర్నూలు చిరంజీవి పార్కు దగ్గర నివాసముంటున్న మరో కాంట్రాక్టర్‌ ఖాతాల్లో దొంగ ఓటర్ల డబ్బులు ఆన్‌లైన్‌లో జమ చేసినట్లు అభ్యర్థి అనుచరులు చర్చించుకుంటున్నారు.

అన్ని దారులూ అన్వేషిస్తూ...

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ అభ్యర్థి అన్ని దారులు అన్వేషిస్తున్నారు. పోలింగ్‌ రోజు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించి బూత్‌ ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేసుకున్నాడు. పోలింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఓటు అడిగేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పోలింగ్‌ సరళిని గమనించేందుకు వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసుకుని పావులు కదుపుతున్నారు.

సైక్లింగ్‌ పద్ధతిలో

ఓటు వేయించేందుకు ప్రణాళిక

దొంగ ఓటర్ల ద్వారా సైక్లింగ్‌ పద్ధతిలో ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ అభ్యర్థి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కర్నూలు తుంగభద్ర నది తీర కాలనీల్లో పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది నివాసముంటున్నారు. సంకల్‌బాగ్‌తో పాటు ధర్మపేట, కొత్తపేట, బాలాజీ నగర్‌, సీతారాం నగర్‌ ప్రాంతాల్లో దొంగ ఓటర్లను నమోదు చేయించినట్లు అభ్యర్థి అనుచరులు చర్చించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సైక్లింగ్‌ పద్ధతిలో ఒక్కొక్కరూ రెండు మూడు ఓట్లు వేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దొంగ ఓట్లను నిరోధించేందుకు ఓటరు చూపుడు వేలుకు పోలింగ్‌ సిబ్బంది ఇంకు సిరా పూస్తారు. అయితే దానిని తుడిపేసుకుని పలుమార్లు ఓటు వేసే విధంగా లిక్విడ్‌ తరహాలో ఉన్న టిన్నర్‌ సీసాలను దొంగ ఓటర్లకు తర్ఫీదునిచ్చి పోలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధం చేసినట్లు ఆయన అనుచరులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పోలింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉంటూ పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టాలని అంతర్గత సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

‘టీడీపీ దొంగ’ ప్లాన్‌
1/1

‘టీడీపీ దొంగ’ ప్లాన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement