31న బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం | Sakshi
Sakshi News home page

31న బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

Published Wed, Mar 29 2023 12:32 AM

- - Sakshi

● ఎమ్మెల్యే ఆత్రం సక్కు

వాంకిడి(ఆసిఫాబాద్‌): వాంకిడి మండల కేంద్రంలో ఈ నెల 31న బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తు న్నట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే స్థలాన్ని నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ విమలబాయి, ఎంపీటీసీ రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌, మారుతి, సర్పంచులు విష్ణు, అయ్యూబ్‌, కమలాకర్‌, మనోహార్‌ తదితరులు పాల్గొన్నారు.

సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే సక్కు
1/1

సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే సక్కు

Advertisement

తప్పక చదవండి

Advertisement