కోల్‌కతా వాసిపై హత్యకేసు కొట్టివేత | Sakshi
Sakshi News home page

కోల్‌కతా వాసిపై హత్యకేసు కొట్టివేత

Published Tue, Apr 23 2024 8:15 AM

మృతదేహాన్ని తరలిస్తున్న శ్రీనివాసరావు - Sakshi

ఖమ్మంలీగల్‌: కోల్‌కత్తాకు చెందిన జాకీర్‌ అలీపై ఖమ్మం అర్బన్‌ పోలీసులు నమోదు చేసిన హత్య కేసును కొట్టి వేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్‌.జగ్జీవన్‌కుమార్‌ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వెలుగుమట్ల పార్క్‌లో జాకీర్‌అలీ, అబ్దుల్లా వాచ్‌ టవర్‌ నిర్మాణ పనులు చేస్తుండగా 2019 మార్చి 15 అబ్దుల్లా చనిపోయాడు. పార్క్‌ ఉద్యోగి ఫిర్యాదు మేరకు జాకీర్‌అలీపై హత్య కేసు నమోదు చేశారు. అయితే, సాక్షులను విచారించగా నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడి తరఫున న్యాయవాదిగా చిలుకూరి స్వర్ణకుమారి వ్యవహరించారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

చింతకాని: మండలంలోని వందనం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపాన పంట పొలాల్లో సోమవారం గుర్తు తెలియని మహిళ(60) మృతదేహం లభ్యమైంది. మతిస్థిమి తం సక్రమంగా లేని సదరు మహిళ ఆదివారం మధ్యాహ్నం పొలాల వైపు వచ్చింది. ఆమె సోమవారం ఉదయం పొలాల వద్ద చనిపోయి కనిపించింది. దీంతో ఎస్సై నాగుల్‌మీరా వివరాలు ఆరా తీశారు. ఆమె చేతిపై ఎ.పోచమ్మ అని పచ్చబొట్టు ఉండగా, ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి

కొణిజర్ల: పంచాయతీ కార్యదర్శి వేఽధిస్తున్నాడని ఆరోపిస్తూ గతనెల 28న పురుగుల మందు తాగిన కార్మికుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని అంజనాపురానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ భూక్యా ప్రసాద్‌ను కార్యదర్శి పనిలోకి రానివ్వడం లేదని చెబుతూ పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన సోమవారం మృతి చెందగా, ప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు పోస్టుమార్టాన్ని అడ్డుకున్నారు. వైరా సీఐ సాగర్‌నాయక్‌, ఎస్‌ఐ శంకరరావు చేరుకుని ప్రసాద్‌ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement