స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

Published Wed, Nov 15 2023 12:20 AM

మాట్లాడుతున్న సీపీ వారియర్‌   - Sakshi

ఖమ్మంక్రైం: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పోలీసు ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ సూచించారు. పోలీస్‌ అధికారులు, ఉద్యోగులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తూ ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే, సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అడిషనల్‌ డీసీపీలు ప్రసాద్‌రావు, కుమారస్వామి, ఏసీపీలు గణేష్‌, బస్వారెడ్డి, రెహమాన్‌, రామానుజం, సారంగపాణి, ప్రసన్నకుమార్‌, రవికుమార్‌, శివరామయ్య, సుశీల్‌ సింగ్‌, నర్సయ్య పాల్గొన్నారు.

ఉద్యోగుల శిక్షణలో సీపీ వారియర్‌

Advertisement
Advertisement